నాకు చాలా ఇబ్బందిగా ఉంది సన్నీలియోన్ | Sunny Leone to do item song in Hate Story 2 | Sakshi
Sakshi News home page

నాకు చాలా ఇబ్బందిగా ఉంది సన్నీలియోన్

Published Tue, Jul 15 2014 11:29 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నాకు చాలా ఇబ్బందిగా ఉంది సన్నీలియోన్ - Sakshi

నాకు చాలా ఇబ్బందిగా ఉంది సన్నీలియోన్

 పోర్న్ తారగా ప్రఖ్యాతి పొంది, తర్వాత బాలీవుడ్ తారగా మారిన సన్నీలియోన్ కూడా కొన్ని విలువల్ని పాటిస్తుందంటే నమ్ముతారా! కానీ ఇది నిజం. ఇటీవల ‘హేట్‌స్టోరి 2’ చిత్రం షూటింగ్ లొకేషన్లో సన్నీలియోన్ ప్రవర్తనే అందుకు నిదర్శనం. వివరాల్లోకెళ్తే- ‘హేట్ స్టోరి 2’ కోసం సన్నీలియోన్‌తో ఓ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారు దర్శకుడు విశాల్ పాండ్య. ముంబయ్‌లోని ఓ స్టూడియోలో ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. అయితే... లొకేషన్లో కొంతమంది పిల్లలు కూడా ఉన్నారట.
 
  అప్పటిదాకా డాన్స్‌లో నిమగ్నమైన సన్నీకి ఉన్నట్లుండి ఆ పిల్లలు కంట పడ్డారు. అంతే... పెద్దగా కేక వేసిందట సన్నీలియోన్. లొకేషన్ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు. తర్వాత సన్నీ తేరుకొని, ‘‘ముందు ఆ పిల్లల్ని బయటకు పంపేయండి. నేను చేస్తోంది ఐటమ్‌సాంగ్. వారి ముందు అలా చేస్తే ఎలా? నాకు చాలా ఇబ్బందిగా ఉంది’’ అనేసిందట. వెంటనే... ప్రొడక్షన్ వాళ్లు అప్రమత్తమై పిల్లల్ని బయటకు పంపేశారట. పోర్న్ సినిమాల్లో నటించిన సన్నీ ఇలా విలువలు పాటించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement