
మెగాస్టార్ రిస్క్ చేస్తున్నాడా..?
రీ ఎంట్రీలో బిగ్ హిట్ కొట్టిన మెగాస్టార్ చిరంజీవి నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రెండు మూడు కథలను ఫైనల్ చేసిన మెగాస్టార్, ఏ సినిమాను పట్టాలెక్కించేది ప్రకటించలేదు. అయితే ఈ సినిమాను కూడా రామ్ చరణే నిర్మిస్తాడని ప్రకటించేశారు. తాజాగా ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది.
చిరు ఎప్పటి నుంచో అనుకుంటున్న ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాను నెక్ట్స్ సినిమాగా పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట. అంతేకాదు ఈ సినిమాను కమర్షియల్ సినిమాల స్పెషలిస్ట్ సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేయనున్నాడట. స్టైలిష్ డైరెక్టర్గా పేరున్న సురేందర్ రెడ్డి, చారిత్రక కథను ఎలా తెరకెక్కిస్తాడో అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
ఇప్పటికే పరుచూరి బ్రదర్స్ ఈ సినిమాకు సంబంధించి కథా కథనాలను రెడీ చేశారు. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ కథ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్పై త్వరలోనే మెగా టీం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.