జగన్‌ అన్నకు కంగ్రాట్స్‌ : సూర్య | Suriya About YS Jagan In NGK Pre Release Event | Sakshi
Sakshi News home page

జగన్‌ అన్నకు కంగ్రాట్స్‌ : సూర్య

Published Tue, May 28 2019 10:16 PM | Last Updated on Tue, May 28 2019 10:19 PM

Suriya About YS Jagan In NGK Pre Release Event - Sakshi

ఎలాంటి పాత్రలోనైనా తనదైన శైలిలో నటిస్తూ సూపర్‌ స్టార్‌గా దూసుకుపోతున్న సూర్య నటించిన తాజా చిత్రం ఎన్‌జీకే(నందగోపాల కృష్ణ). నేటి సాయంత్రం(మే 28) హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతోన్న వైఎస్‌ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

వైఎస్‌ జగన్‌ను తాను జగనన్న అని పిలుస్తానంటూ, రాబోయే రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలు ఎంతో అభివృద్ది సాధిస్తాయని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావడం మనం చూస్తున్నామని, ఇది చాలా మంచి పరిణామని.. వైఎస్‌ జగన్‌, కేటీఆర్‌, బెంగళూరులో పోటీ చేసిన తేజస్వినీ సూర్యలను ప్రస్తావించారు. సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రాబోతోన్న ఎన్‌జీకే చిత్రంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌, సాయి పల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement