సూర్య హీరోగా 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 24 ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటోంది. సూర్య అఫిషీయల్ ట్విట్టర్ పేజ్లో రిలీజ్ చేసిన రెండు పోస్టర్స్లో రెండు డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తున్నాడు సూర్య. గన్తో రఫ్ లుక్లో డాన్లా ఓ ఇమేజ్లో కనిపిస్తుంటే, మరో పోస్టర్లో సైంటిస్ట్లా దర్శనమిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సినిమా మీద ఉన్న అంచనాలు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్స్తో మరింతగా పెరిగాయి.
స్టూడియో గ్రీన్ బ్యానర్తో పాటు 2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత, నిత్యామీనన్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాలంలో ప్రయాణించటం అనే కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న ఈ భారీ గ్రాఫికల్ సినిమాకు స్వర సంచలనం ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. 2016లో వేసవిలో 24 మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది.
Here's the first look of #24TheMovie very close to my heart, loved working! Hope you guys like it! #24FirstLook