ఆగస్టులో తెరపైకి ఎస్-3? | Suriya's 'S3' in August! | Sakshi
Sakshi News home page

ఆగస్టులో తెరపైకి ఎస్-3?

Published Thu, Jun 16 2016 2:19 AM | Last Updated on Wed, Apr 3 2019 8:56 PM

ఆగస్టులో తెరపైకి ఎస్-3? - Sakshi

ఆగస్టులో తెరపైకి ఎస్-3?

అంజాన్, మాస్ వంటి చిత్రాలతో కాస్త తడబడ్డ నటుడు సూర్య ఇటీవల విడుదలైన 24 చిత్రంతో అద్భుత విజయాన్ని సాధించి తన సత్తా చాటుకున్నారు. సూర్య, దర్శకుడు హరిల కలయికలో ఇంతకు ముందు రూపొందిన సింగం, దానికి సీక్వెల్ చిత్రాలు ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. తాజాగా వాటికి సీక్వెల్‌గా ఎస్-3 తెరకెక్కుతున్న విషయం విదితమే. స్టూడియోగ్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అధిక భాగం విదే శాల్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఎస్-3 చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

దీనికి హరీష్‌జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం పాటలకు బాణీలు కడుతున్న ఆయన జులై తొలి వారానికి పాటల రికార్డింగ్‌ను పూర్తి చేసి అందిస్తాననడంతో జులై రెండో వారంలో చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఎస్-3 చిత్రంలో సూర్యకు జంటగా అనుష్క, శ్రుతిహసన్ నటిస్తున్నారు. రాధారవి, వివేక్, నాజర్, రాధిక, సూరి ముఖ్య పాత్రలను పోషిస్తున్న ఎస్-3 చిత్ర విడుదలను ఆగస్ట్‌లో ఎదురు చూడవచ్చునన్నమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement