షారుక్‌కు యశ్‌ చోప్రా అవార్డు .. సుమన్‌కు ఆధ్యాత్మిక నట ప్రవీణ | 'T. Subbirami Reddy's Foundation ' awards | Sakshi

షారుక్‌కు యశ్‌ చోప్రా అవార్డు .. సుమన్‌కు ఆధ్యాత్మిక నట ప్రవీణ

Feb 22 2017 11:51 PM | Updated on Sep 5 2017 4:21 AM

షారుక్‌కు యశ్‌ చోప్రా అవార్డు .. సుమన్‌కు ఆధ్యాత్మిక నట ప్రవీణ

షారుక్‌కు యశ్‌ చోప్రా అవార్డు .. సుమన్‌కు ఆధ్యాత్మిక నట ప్రవీణ

కళాకారులను ప్రోత్సహించడానికి టి. సుబ్బిరామిరెడ్డి ఎప్పుడూ ముందుంటారు.

కళాకారులను ప్రోత్సహించడానికి టి. సుబ్బిరామిరెడ్డి ఎప్పుడూ ముందుంటారు. ‘టి.సుబ్బిరామిరెడ్డి ఫౌండేషన్‌’ ద్వారా ప్రతి ఏటా ప్రతిభావంతులకు అవార్డులు ఇస్తుంటారు. ఈ వారంలో ఆయన రెండు వేడుకలు నిర్వహించనున్నారు. ఒకటి వైజాగ్‌లో, మరొకటి ముంబైలో. రెగ్యులర్‌ క్యారెక్టర్స్‌తో పాటు వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడు, శివుడు.. ఇలా దేవుడి పాత్రల్లో అద్భుతమైన నటన కనబర్చిన సుమన్‌ని శుక్రవారం వైజాగ్‌లో జరగనున్న వేడుకలో ‘ఆధ్యాత్మిక నట ప్రవీణ’ బిరుదుతో సత్కరించనున్నారు. పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొననున్నారు.

ప్రముఖ దర్శక–నిర్మాత యశ్‌ చోప్రా పేరు మీద అందిస్తున్న ‘యశ్‌చోప్రా నేషనల్‌ మెమోరియల్‌’ అవార్డును ఈసారి షారుక్‌ ఖాన్‌కు ఇవ్వను న్నారు. శనివారం ముంబైలో జరగనున్న ఈ వేడుకలో బాలీవుడ్‌ ప్రముఖులతో పాటు తెలుగు పరిశ్రమ నుంచి మోహన్‌బాబు, జయప్రద తదితరులు పాల్గొననున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement