
జీవీతో ఓకే అంటుందా?
జీవీ ప్రకాశ్‌కుమార్‌కు జంటగా నటించడానికి మిల్కీబ్యూటీ తమన్నా ఓకే అంటుందా? బాహుబలి, తోళా, దేవి వంటి భారీ చిత్రాల్లో నటించి వరుస విజయాలతో మంచి జోరుమీదున్న తమన్నా ప్రస్తుతం శింబుకు జంటగా అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో నటిస్తోంది. మరోసారి డాన్సింగ్ కింగ్ ప్రభుదేవాతో రొమాన్స్ చేయనుందనే ప్రచారం జరుగుతోంది. కాగా ఈ బ్యూటీ తెలుగులో నాగచైతన్యతో జత కట్టిన 100% లవ్ చిత్రం అక్కడ పెద్ద విజయం సాధించింది. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాజాగా కోలీవుడ్‌లో రీమేక్ కానుంది. తెలుగు చిత్రానికి దర్శకత్వం వహించిన సుకుమార్ తమిళ వెర్షన్‌కు నిర్మాతగా మారారు. ఎం.ఎం. చంద్రమౌళి అనే నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు.
ఈయన హాలీవుడ్ ప్రముఖ ఛాయాగ్రహకుడు ఫ్రైడ్‌మాబీ శిష్యుడన్నది గమనార్హం. కాగా, ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ఇటీవలే ప్రారంభమయ్యింది. త్వరలో చిత్రం సెట్‌పైకి వెళ్లనుంది. ఇందులో జీవీ ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటించనున్నారు. ఆయనకు నాయకి ఎవరన్నది ఇంకా నిర్ణయం కాలేదు. తెలుగులో నటించిన తమన్నానే తమిళంలోనూ నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. అయితే ఈ బ్యూటీ జీవీతో నటించడానికి సై అంటుందా? అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఈ 100% లవ్ చిత్రంలో క«థానాయకి పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. తెలుగు చిత్రంలో నటించిన తమన్నాకు మంచి పేరు వచ్చింది. ఇది హీరోహీరోయిన్ల మధ్య చిన్న ఈగోతో కూడిన ప్యూర్ లవ్ స్టోరీ అన్నది గమనార్హం.