
మొదటి వారంలో ఓ హౌస్‌మేట్‌ను ఇంటికి పంపించిన బిగ్‌బాస్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఓ కంటెస్టెంట్‌ను హౌస్‌లో ప్రవేశపెట్టనున్నాడు. ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి పేరు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం, నారా లోకేష్ విషయంలో తమన్నాకు ఒక్కసారిగా ఫేమ్ వచ్చేసింది. అంతేకాకుండా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా తమన్నా బరిలో దిగింది.
‘ఎవరైనా తనను తాను నిరూపించుకోవడానికి చేసే యుద్దాన్ని కేవలం రెండక్షరాల్లో చెప్పే చిన్నమాట నేను. అతనిలో నేను ఆమెలా ఉంటూ.. గుర్తింపు కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. నా చేతి గాజులు గీసే గీతలు దాటుతూ.. గడియారం చేతులు చూపే సమయంతో మారుతూ వచ్చాను. ఇప్పటికీ చాలా మంది నన్ను అడిగే మొదటి ప్రశ్న నేనెవరు? కుటుంబం భయంతో మోసే బరువును కాను.. ధైర్యంతో ఓ కొత్త కుటుంబాన్ని గెలుచుకునే బంధాన్ని నేను. వీళ్లేం చేస్తారులే అని చులకగా చూసే సమాజాన్ని కాను.. సవాలు చేసి సమరం సాగించే సైన్యాన్ని నేను.. నిజానికి నేనువరు? నాకు తెలుసు. నాకు మాత్రమే తెలిసిన నన్ను మీకు పరిచయం చేయడానికి నాకు వచ్చిన అవకాశమే బిగ్‌బాస్’ అంటూ తన మనసులో మాటలు చెప్పుకుంటూ తమన్నా సింహాద్రి స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చింది. మరి తమన్నాకు బిగ్‌బాస్ హౌస్‌లో ఎలాంటి పరిస్థితులు ఎదురు కానున్నాయి? చివరి వరకు మనోధైర్యంతో నిలబడుతుందా? లేదా అన్నది చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment