![Tamil Actor Aathmika Looks Samantha Ruthu Pics Goes Viral - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/14/jr-sam.jpg.webp?itok=2BBNE9JD)
తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా ఉన్న ‘సమంత’ ఫొటోలు అంటూ కొన్ని పిక్స్ వైరల్ అవుతున్నాయి. అవి చూసిన నెటిజన్లు బక్కచిక్కి.. జీరో సైజ్ ఉండాల్సిన సమంత.. ఏంటీ ఇలా చబ్బీ చీక్స్‌తో కాస్త బొద్దుగా ఉంది అనుకుంటున్నారు. మరికొంతమంది.. ఇవి సమంత టీనేజీ ఫొటోలై ఉంటాయిలే అని కామెంట్లు చేస్తున్నారు. ఆ తర్వాత అవి సమంత ఫొటోలు కాదని తెలిసి నాలుక కరచుకుంటున్నారు. ఇంతకీ సంగతి ఏమిటంటే.. ఇప్పటికే ‘బిగ్ బాస్-3’ ఫేమ్ ఆశురెడ్డిని జూనియర్ సమంత అంటూ ఆ మధ్య కాలంలో తనను సెలబ్రెటీని చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఆత్మిక అనే వర్థమాన నటిని ఇప్పుడు సమంతకు చెల్లిలా ఉందంటూ నాగచైతన్యకు మరదలిని చేసేస్తున్నారు.
తమిళ పరిశ్రమలో నటిగా ఇప్పుడిప్పుడే కెరీర్ మొదలు పెట్టిన ఆత్మిక తాజాగా ఓ ఫొటో షూట్‌లో పాల్గొంది. వీటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ నేపథ్యంలో.. ‘‘సమంత చెల్లెలు’’ అంటూ సోషల్ మీడియాలో ఇవి వైరల్ అవుతున్నాయి. ‘ఏం మాయ చేశావే’లో నాగచైతన్యతో పాటు కుర్రకారు మనసులను దోచుకున్న అప్పటి సమంతలా ఉండటంతో.. తనకు చెల్లెలు ఉంటే ఎలా ఉంటుందో ఈ అమ్మడు అచ‍్చం అలాగే ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment