ద్వారక అందరూ చూసేలా ఉంటుంది | telugu new movie Producer rb Choudary | Sakshi
Sakshi News home page

ద్వారక అందరూ చూసేలా ఉంటుంది

Published Fri, Aug 26 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

ద్వారక అందరూ చూసేలా ఉంటుంది

ద్వారక అందరూ చూసేలా ఉంటుంది

- నిర్మాత ఆర్‌బీ చౌదరి
 కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలను అందించడంలో ఎప్పుడూ ముందుండే బ్యానర్ సూపర్‌గుడ్ ఫిలింస్. ఈ సంస్థ అధినేత ఆర్‌బీ చౌదరి సమర్పణలో శ్రీనివాస్ రవీంద్ర(ఎంఎస్‌ఆర్) దర్శకత్వంలో ప్రద్యుమ్న, గణేష్ నిర్మించిన చిత్రం ‘ద్వారక’. విజయ్ దేవరకొండ, పూజా జవేరి జంటగా నటించిన ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఆర్‌బీ చౌదరి మాట్లాడుతూ- ‘‘మా బ్యానర్ ద్వారా ఎంతో మంది ఆర్టిస్ట్స్‌ని, టెక్నీషియన్స్‌ని పరిచయం చేశాం. ‘ద్వారక’తో శ్రీనివాస్‌ను దర్శకునిగా పరిచయం చేస్తు న్నాం.
 
  ప్రద్యుమ్న, గణేష్‌లతో కలిసి ఈ చిత్రానికి అసోసియేట్ అవడం ఆనందంగా ఉంది. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయింది. అందరూ చూసేలా ఈ సినిమా ఉంటుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘సమాజానికి ఉపయోగపడే సినిమాలు అందించే చౌదరిగారితో కలిసి ఈ చిత్రం చేసినందుకు హ్యాపీగా ఉంది’’ అని ప్రద్యుమ్న పేర్కొన్నారు. శ్రీనివాస్ రవీంద్ర, విజయ్ దేవరకొండ, పూజా జవేరి, సంగీత దర్శకుడు సాయికార్తీక్, మాటల రచయిత లక్ష్మీభూపాల్ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement