గాడ్ నుంచి రెండో మెసేజ్? | The second message from God? | Sakshi
Sakshi News home page

గాడ్ నుంచి రెండో మెసేజ్?

Published Mon, Sep 28 2015 11:51 PM | Last Updated on Sun, Sep 3 2017 10:08 AM

గాడ్ నుంచి రెండో మెసేజ్?

గాడ్ నుంచి రెండో మెసేజ్?

ఆయన గాడ్ కాదు... మెసెంజర్ ఆఫ్ గాడ్. మొదటిచ్చిన సినిమా మెసేజ్‌కు ఆదరణ లభించడంతో, ఇప్పుడు రెండో మెసేజ్‌తో సిద్ధమయ్యాడు. గిరిజనుల అభివృద్ధి, మాంసాహారం తినడం వల్ల ఎలాంటి నష్టం కలుగుతుందనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం ‘యంఎస్‌జి-2’. ‘మెసెంజర్ ఆఫ్ గాడ్’ (యం.ఎస్.జి)కి  సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందింది. ఆధ్యాత్మిక గురువు సంత్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ హీరోగా నటించి, స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం తెలుగు వెర్షన్ అక్టోబరు 1న రిలీజ్ కానుంది.

ఇటీవలే ఇంగ్లీష్, హిందీ వెర్షన్స్ రిలీజయ్యాయి. దర్శక-నిర్మాత మాట్లాడుతూ, ‘‘మొదటి చిత్రం ‘యంయస్‌జి-1’ ఆదరణ పొందింది. ‘నా మెసేజ్‌ను ప్రజలు అంగీకరించారన్న అభిప్రాయంతో ఈసారి మరో మంచి సందేశంతో రెండో భాగం తీశా. ఇంగ్లిష్, హిందీల్లో ఈ సెకండ్ పార్ట్‌కి మొదటి భాగానికి మించిన స్పందన లభిస్తోంది. అందుకే తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాం’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement