లీజు విధానాన్ని ఎత్తివేయాలి! | Theatres lease policy Abolishment | Sakshi
Sakshi News home page

లీజు విధానాన్ని ఎత్తివేయాలి!

Published Tue, Oct 21 2014 12:51 AM | Last Updated on Sat, Aug 11 2018 6:09 PM

లీజు విధానాన్ని ఎత్తివేయాలి! - Sakshi

లీజు విధానాన్ని ఎత్తివేయాలి!

‘‘చిన్న చిత్రాలకు అన్యాయం జరుగుతోంది. తక్షణమే థియేటర్ల లీజు విధానాన్ని ఎత్తివేయాలి’’ అని తెలంగాణ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ గిల్డ్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. శనివారం మొదలుపెట్టి గత మూడు రోజులుగా పలువురు చిన్న చిత్రాల నిర్మాతలతో కలిసి ఆయన దీక్ష చేస్తున్నారు. రామకృష్ణ గౌడ్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండగా, ఇతర నిర్మాతలు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. థియేటర్ల గుత్తాధిపత్యాన్ని అంతం చేయాలనీ, గతంలో మాదిరిగా ప్రతి థియేటర్లోనూ మార్నింగ్ షోను చిన్న చిత్రాలకు కేటాయించాలనీ రామకృష్ణ కోరారు. ఇంకా చిన్న నిర్మాతలకు ఎదురవుతున్న పలు ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామనీ, సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం ఉందని ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement