విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు సై! | Trisha Mohini First Look Poster Released | Sakshi
Sakshi News home page

విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు సై!

Published Sat, Oct 22 2016 1:55 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు సై!

విజయ్‌సేతుపతితో రొమాన్స్‌కు సై!

స్టార్ హీరోలతో జత కట్టిన నేటి టాప్ హీరోయిన్లు ఇప్పుడు యంగ్ హీరోలతో జోడి కట్టడానికి ఆసక్తి చూపిస్తున్నారని చెప్పవచ్చు. నయనతార,తమన్నా, కాజల్‌అగర్వాల్ ఇలా ప్రముఖ కథానాయికలందరికీ యువకథానాయకులతో నటించే అవకాశాలు తలుపుతడుతున్నాయి. తాజాగా నటి త్రిషకు కూడా అలాంటి అవకాశం వచ్చిందని సమాచారం. మరో విషయం ఏమిటంటే సాధారణంగా హీరోయిన్లు నాలుగైదేళ్ల కంటే ఎక్కువ కాలం మన్నగలగడం కష్టం. అలాంటిది నయనతార, అనుష్క, త్రిష లాంటి చాలా తక్కువ మంది దశాబ్దం దాటి నాయికలుగా రాణిస్తున్నారు. అందులోనూ వీరికి వయసు పెరుగుతున్న కొద్దీ అవకాశాలు అధికం అవుతుండడం గమనార్హం.ప్రస్తుతం చేతి నిండా చిత్రాలు ఉన్న తారామణుల్లో త్రిష ఒకరు.

తను నటిస్తున్న తాజా చిత్రం మోహిని ఫస్ట్‌లుక్ పోస్టర్ విడుదలై ఇప్పటికే భారీ అంచనాలను సంతరించుకుంది. ధనుష్‌తో నటించిన కొడి చిత్రం దీపావళికి తెరపైకి రానుంది. కాగా అరవిందస్వామికి జంటగా నటిస్తున్న చతురంగవేట్టై-2 చిత్రం శుక్రవారం ప్రారంభమైంది. ఇకపోతే యువ నటుడు విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేయడానికి ఈ చెన్నై చిన్నది రెడీ అవుతున్నారన్న తాజా సమాచారం. విజయ్‌సేతుపతికి కథానాయకుడిగా పెద్ద బ్రేక్ ఇచ్చిన చిత్రం నడువుల కొంచెం పక్కత్త కానోమ్. ఈ చిత్ర చాయాగ్రహకుడు సి.ప్రేమ్‌కుమార్ ఇప్పుడు దర్శకుడిగా మెగాఫోన్ పట్టనున్నారు.

ఇందులో విజయ్‌సేతుపతినే హీరో. ఆయనకు జంటగా కథ ప్రముఖ హీరోయిన్లను డిమాండ్ చేసిందట. దీంతో నయనతారను గానీ, త్రిష గానీ ఎంపిక చేయాలని భావించిన చిత్ర దర్శక నిర్మాతలు చివరికి త్రిష వైపే మొగ్గు చూపినట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. ఆ ముద్దుగుమ్మ కూడా విజయ్‌సేతుపతితో రొమాన్స్ చేయడానికి సై అన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని నందగోపాల్ నిర్మించనున్నట్లు, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement