ఉదయనిధి కొత్త చిత్రం ప్రారంభం | Udhayanidhi Stalin starts shooting for his next | Sakshi
Sakshi News home page

ఉదయనిధి కొత్త చిత్రం ప్రారంభం

Published Wed, Aug 24 2016 1:21 AM | Last Updated on Wed, Apr 3 2019 9:14 PM

ఉదయనిధి కొత్త చిత్రం ప్రారంభం - Sakshi

ఉదయనిధి కొత్త చిత్రం ప్రారంభం

నటుడు, నిర్మాత ఉదయనిధి స్టాలిన్ నూతన చిత్రం సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మనిదన్ చిత్ర విజయంతో మంచి జోష్‌లో ఉన్న ఉదయనిధి స్టాలిన్ వేలన్ను వందుట్టా వెళ్లక్కారన్ చిత్ర విజయంతో యమ ఖుషీలో ఉన్న దర్శకుడు ఎళిల్‌ల కాంబింనేషన్‌లో తెరకెక్కనున్న ఈ చిత్రం ఆగస్ట్‌లో ప్రారంభం కానున్నట్లు ఇంతకు ముందే ప్రకటించిన విషయం తెలిసిందే. ఉదయనిధి స్టాలిన్ తన రెడ్‌జెయింట్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
  ఇందులో నటి రెజీనా, శ్రుష్టిడాంగే హీరోయిన్లుగా నటించనున్నారు. సూరి హాస్య పాత్రను పోషించనున్న ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతాన్ని అందించనున్నారు. చిత్ర షూటింగ్‌ను కారైక్కల్, దాని చుట్టు పక్క ప్రాంతాల్లో చిత్రీకరించి క్రిస్‌మస్ సందర్భంగా విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు దర్శకుడు తెలిపారు. ఇది పూర్తిగా వినోదభరిత చిత్రంగా ఉంటుందని చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement