'మనలో ఒకడు' నిర్మాతల మరో ప్రయత్నం
మనలో ఒకడు సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టిన యుని క్రాఫ్ట్ మూవీస్, తన బ్యానర్ లో రెండో సినిమాను ఎనౌన్స్ చేసింది. ఆర్పీ పట్నాయక్ దర్శకత్వంలో ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ తెరకెక్కించిన మనలో ఒకడు సినిమాతో అభిరుచి గల నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత గురజాల జగన్ మోహన్. ప్రస్తుతం ఆయన తన రెండో ప్రయత్నంగా సిద్ధేశ్వర్ మనోజ్ దర్శకత్వంలో సినిమాను ఎనౌన్స్ చేశారు. దర్శకుడు మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ప్రీ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ప్రియ ప్రేమలో ప్రేమ్ సినిమాతో హీరోగా, దర్శకుడిగా పరిచయం అయ్యాడు సిద్దేశ్వర్ మనోజ్. తొలి ప్రయత్నంగా లవ్ స్టోరిని ఎంచుకున్న మనోజ్, రెండో సినిమాను యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిస్తున్నారు.