హార్దిక్‌కు కాబోయే భార్య గురించి.. | Urvashi Rautela Talks About Hardik Pandya Fiancee Natasa Stankovic | Sakshi
Sakshi News home page

నటాషాను ఒక్కసారే కలిశా: ఊర్వశి

Jan 3 2020 9:02 PM | Updated on Jan 3 2020 9:02 PM

Urvashi Rautela Talks About Hardik Pandya Fiancee Natasa Stankovic - Sakshi

పాగల్‌పంటి సినిమా ప్రమోషన్‌లో ఒకసారి నటాషాను కలిశానని,  తామిద్దరం వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోలేదని ఊర్వశి వెల్లడించారు.

ముంబై: సెర్బియా నటి నటాషా స్టాన్‌వికోవిచ్‌ మంచి మనిషి అని హార్దిక్‌ పాండ్యా మాజీ ప్రియురాలు, బాలీవుడ్‌ హీరోయిన్‌ ఊర్వసి రౌతేలా అన్నారు. నటాషాను ఒక్కసారి మాత్రమే ముఖాముఖి కలిశానని ఆమె వెల్లడించారు. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో మంగళవారం మోడల్‌ నటాషా స్టాన్‌కోవిచ్, పాండ్యా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఊర్వశి రౌతేలా ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

పాగల్‌పంటి సినిమా ప్రమోషన్‌లో ఒకసారి నటాషాను కలిశానని, ఆ సమయంలో తామిద్దరం వ్యక్తిగత విషయాలు మాట్లాడుకోలేదని ఊర్వశి రౌతేలా వెల్లడించారు. నిశ్చితార్థం చేసుకున్న హార్దిక్‌, నటాషా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్టు చెప్పారు. అంతేకాదు వారిద్దరికీ అవసరమైనప్పుడు ఎటువంటి సాయం కావాలన్నా చేయడానికి సిద్ధం ఉన్నానని భరోసాయిచ్చారు. హార్దిక్‌, నటాషాలకు క్రికెటర్లతో పాటు బాలీవుడ్‌ ప్రముఖులు శుభా​కాంక్షలు తెలిపారు. నటాషా మాజీ ప్రియుడు, టీవీ నటుడు అలై గోని కూడా హార్ట్‌సింబల్‌ను (ఎమోజీ) పోస్ట్‌ చేసి విషెస్‌ చెప్పాడు. హార్దిక్‌, నటాషా పెళ్లెప్పుడనేది ఇంకా ప్రకటించలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement