ఆ మాట అన్న ప్రతిసారి పెద్ద వసూళ్లు  – రాజేంద్రప్రసాద్‌  | That word is every time a big collection - Rajendra Prasad | Sakshi
Sakshi News home page

ఆ మాట అన్న ప్రతిసారి పెద్ద వసూళ్లు  – రాజేంద్రప్రసాద్‌ 

Published Wed, Mar 14 2018 12:58 AM | Last Updated on Wed, Mar 14 2018 12:58 AM

That word is every time a big collection - Rajendra Prasad - Sakshi

‘‘సాధారణంగా చిన్న సినిమా, పెద్ద సినిమా అంటుంటారు. నా చిత్రాన్ని చిన్న సినిమా అన్న ప్రతిసారి పెద్ద వసూళ్లను సాధించాయి. ‘ఊ.పె.కు.హ’ సినిమా కూడా పెద్ద హిట్‌ అయి మంచి వసూళ్లు రాబడుతుంది’’ అని నటుడు రాజేంద్రప్రసాద్‌ అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో ‘నిధి’ ప్రసాద్‌ దర్శకత్వంలో భాగ్యలక్ష్మి నిర్మించిన సినిమా ‘ఊ.పె.కు.హ’. ‘ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి’ అన్నది ఉపశీర్షిక. సాక్షీ చౌదరి కథానాయిక. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందించారు. బిగ్‌ సీడీని నిర్మాత కిరణ్, ఆడియో సీడీలను రాజేంద్రప్రసాద్‌ విడుదల చేశారు. అనంతరం రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘నేను రాజ్‌–కోటిగారితో పనిచేసేటప్పుడు దిలీప్‌ అనే కీబోర్డ్‌ ప్లేయర్‌ ఉండేవాడు. తనే ఇప్పుడు ఎ.ఆర్‌.రెహమాన్‌ అయ్యారు.

అనూప్‌ కూడా తాను కీ బోర్డ్‌ ప్లేయర్‌నని చెప్పుకోవడం వింటుంటే ఆనందంగా ఉంది. భాగ్యలక్ష్మి, విక్రమ్‌ ఈ సినిమాను చక్కగా నిర్మించారు’’ అన్నారు. ‘‘వినోదాత్మకంగా తెరకెక్కిన చిత్రమిది. మా సినిమాకు సంగీతం చేయమని అడిగే సమయంలో అనూప్‌ చాలా బిజీగా ఉన్నాడు. అయినా నేను అడిగానని ఒప్పుకుని, అనుకున్న సమయం కంటే ముందుగానే ఆడియో పూర్తి చేసి ఇచ్చినందుకు థ్యాంక్స్‌. త్వరలోనే సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు ‘నిధి’ ప్రసాద్‌. భాగ్యలక్ష్మి, సాక్షీచౌదరి, అనూప్‌ రూబెన్స్‌ పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement