'అమిర్ అంటే ఓ నెరవేరే కల'
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటుడు అమిర్ ఖాన్తో పనిచేయాలనుకునే ప్రతి వ్యక్తి కల తప్పకుండా నెరవేరుతుందని దర్శకురాలు అశ్విని అయర్ తివారీ అన్నారు. దర్శకుడు నితీశ్ తివారీ భార్య అయిన ఆమె ప్రస్తుతం అమిర్ నటిస్తున్న 'దంగల్' చిత్ర సెట్ వద్దకు వెళ్లిన సందర్భంలో ఆ విశేషాలు చెప్పారు.
'దంగల్ చిత్రం కోసం వేసిన సెట్ వద్దకు నేను వెళ్లాను. అమిర్ ఖాన్ పనిచేస్తుండటం చూశాను. నా కల నెరవేరుతుందని అనుకుంటున్నాను. ఈ చిత్రానికి నా భర్త నితేశ్ దర్శకత్వం వహిస్తున్నారా.. లేక నేనా అనేది విషయమే కాదు. నేను అమిర్ చిత్రాలకు దర్శకత్వం వహించడం ఎప్పటికీ ప్రేమిస్తాను. అతడు ప్రతి దర్శకుడికి నెరవేరే ఓ కలలాంటివాడు. ఆయన చాలా ప్రజ్ఞావంతులు' అని ఆమె చెప్పారు.