నా అందానికి అదే కారణం | Yoga is the secret of my beauty says Kajal agarwal | Sakshi
Sakshi News home page

నా అందానికి అదే కారణం

Published Sat, Jul 5 2014 11:20 PM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM

నా అందానికి అదే కారణం - Sakshi

నా అందానికి అదే కారణం

 కుర్రకారు గుండెల్ని కొల్లగొట్టే సౌందర్యం కాజల్ అగర్వాల్ సొంతం. అంతటి కవ్వించే తన సౌందర్య రహస్యం గురించి కాజల్ అగర్వాల్ ఏమంటున్నారో చూద్దాం. నాకు ఏక కాలంలో పలు చిత్రాలు చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఏ చిత్రంపైనా పూర్తిగా ఏకాగ్రత చూపలేం. చిత్రం తరువాత చిత్రం చేస్తే ఆ పాత్రలో అంకిత భావంతో నటించగలం. నటించింది తక్కువ చిత్రాలే అయినా అవి మంచి కథా బలం ఉన్న చిత్రాలుగా ఉండాలని భావిస్తాను.
 
 పసలేని చిత్రాలు పది చేస్తే ఆ తరువాత సినిమాలో నిలబడలేం. నేనందంగా ఉంటానంటారు. అందుకు కారణం యోగానే. నిత్యం యోగా చేస్తాను. ఇదే నా సౌందర్య రహస్యం అని పేర్కొన్న కాజల్ తుపాకీ చిత్రంలో తమిళనాట సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆల్ ఇన్ ఆల్ అళగు రాజా, జిల్లా చిత్రాల్లో నటించినా కొంత గ్యాప్ వచ్చింది. అందుకు కారణం తెలుగు, హిందీ చిత్రాలతో బిజీగా ఉండడమేనంటున్న కాజల్, తాజాగా బాలాజీ మోహన్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. తెలుగులో మూడు, హిందీలో ఒక చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement