
సమత,యువరాజ్
యువరాజ్, సమత జంటగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. రావ్ దుర్గం దర్శకునిగా పరిచయం చేస్తూ ఎస్.కె.యమ్.ఎల్. మోషన్ పిక్చర్స్‌పై కాండ్రేగుల ఆదినారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఊటీలో ప్రారంభమైంది. ఆదినారాయణ మాట్లాడుతూ– ‘‘సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రమిది. లవ్, కామెడీతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాలున్నాయి. ఊటీతో పాటు హైదరాబాద్‌లోనూ చిత్రీకరణ జరపనున్నాం. కీలక పాత్రలో నాగబాబుగారు నటిస్తున్నారు. ఆయన పాత్ర సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది. త్వరలో టైటిల్ ప్రకటిస్తాం. వేసవిలో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment