డెహ్రాడూన్ : యాత్రా స్ధలాల్లోని ప్రభుత్వ అతిథి గృహాల్లో నాన్ వెజ్ వంటకాలను వడ్డిస్తున్నారనే ప్రచారం అవాస్తవమని ఉత్తరాఖండ్ మంత్రి సత్పాల్ మహరాజ్ తోసిపుచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థ గర్వాల్ మండల్ వికాస్ నిగమ్‌లో మాంసాహార వంటకాలు అందుబాటులో ఉన్నాయనే వదంతులు నిరాధారమని స్పష్టం చేశారు. ఈ తరహా వదంతులను కొందరు ప్రేరేపిస్తున్నారని, చార్‌ధామ్ యాత్ర చేపట్టే భక్తులతో సహా యాత్రికులు ఇతరులందరికీ వీటిని విశ్వసించరాదని తాను విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.
ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ను యాత్రాస్థల పునరుద్ధరణ, ఆథ్యాత్మిక వాతావరణ మెరుగుదల (ప్రసాద్) పథకం కింద కేంద్రం గుర్తించిందని చెప్పారు. ఉత్తరాఖండ్‌లో టూరిజం అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక చొరవ కనబరుస్తోందన్నారు. భారీ వర్షాల కారణంగా చార్‌ధామ్ యాత్ర మార్గాల మూసివేత అనంతరం నెలకొన్న పరిస్థితిని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర రావత్ సమీక్షిస్తున్నారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment