వరకట్నం కేసు పెట్టిన 18 ఏళ్ల తర్వాత బాధితురాలికి న్యాయం జరిగింది. ఆమె భర్త, అత్తకు రెండేళ్ల పాటు జైలు శిక్ష పడింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. 1996లో తన భర్త సతేందర్ యాదవ్, అత్త శాంతి దేవి, మామ నాథూరామ్ కట్నం కోసం వేదిస్తున్నారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటికి రెండేళ్ల క్రితం జరిగిన తమ పెళ్లి సందర్భంగా తమ తల్లిదండ్రులు కట్నకానుకలు సమర్పించారని, అయితే అదనపు కట్నం కోసం తనను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని ఆరోపించింది.
ఆ తర్వాత నాథూరామ్ మరణించగా, సతేందర్ మరో వివాహం చేసుకున్నాడు. ఈ కేసు అనేక మలుపులు తిరుగుతూ, సుదీర్ఘకాలం పాటు విచారణ సాగింది.ఎట్టకేలకు స్థానిక మేట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును వెలువరించింది. సతేందర్, శాంతి దేవిని దోషులుగా పేర్కొంటు రెండేళ్లు జైలు శిక్ష విధించారు.
ఫిర్యాదు చేసిన 18 ఏళ్ల తర్పాత వెలువడిన తీర్పు..
Published Wed, Oct 2 2013 4:28 PM | Last Updated on Fri, May 25 2018 12:54 PM
Advertisement
Advertisement