
బెగూసరాయ్: బిహార్‌లోని సిమరియా ఘాట్ వద్ద శనివారం ఉదయం కార్తీక పౌర్ణమి సందర్భంగా రద్దీ పెరిగి ఊపిరాడక ముగ్గురు వృద్ధురాళ్లు మరణించారు. తొలుత దీనిని తొక్కిసలాటగా భావించగా, చనిపోయిన ముగ్గురూ 80కి పైగా వయసు ఉన్నవారేననీ, రద్దీ కారణంగా ఊపిరి తీసుకోవడం కష్టమవడం వల్లే వారు మృతి చెందారని పోలీసులు చెప్పారు. కార్తీక పౌర్ణమి, అర్ధ కుంభ్‌ను పురస్కరించుకుని సిమరియా ఘాట్ వద్ద గంగా నదిలో స్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు గుమిగూడారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment