4.12 కోట్ల మంది వధువులు కావలెను!
ఇది ఒక్క అబ్బాయి కోరిక కాదు. భారతదేశంలోని 4.12 కోట్ల మంది యువకుల కంఠశోష! పెళ్లీడుకు వచ్చివుండీ, తగిన వధువు దొరక్క బలవంతపు బ్రహ్మచర్యంతో కాలం వెళ్లదీస్తున్న అబ్బాయిల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. జనగణనలో వెల్లడైన భారతీయలు వైవాహిక స్థితిగతుల ప్రకారం, దేశంలోని చాలామందికి పెళ్లయ్యే దారి కనబడటం లేదు. స్త్రీ, పురుష నిష్పత్తి దారుణంగా పడిపోవడమే దీనికి ప్రధాన కారణం. 1000 మంది పురుషులకు ప్రస్తుతం 908 మంది స్త్రీలున్నారు. 1901లో ఈ సంఖ్య 972. సహజ లింగ నిష్పత్తి 954 కన్నా ఇది మెరుగు. అయితే క్రమంగా ఈ సంఖ్య 1990ల్లో 930కి, 1980ల్లో 934కి, 1990ల్లో 927కి పడిపోతూ వచ్చింది. కొన్ని దశాబ్దాల పాటు బాలికల జననం మీద కొనసాగిన దారుణమైన వివక్షే దీనికి ప్రధాన కారణం.
20ల్లో ఉన్న యువకులు 5.63 కోట్లు
20ల్లో ఉన్న యువతులు 2.07 కోట్లు
30ల్లో ఉన్న యువకులు 70.1 లక్షలు
30ల్లో ఉన్న యువతులు 22.1 లక్షలు
40ల్లో ఉన్న యువకులు 16.92 లక్షలు
40ల్లో ఉన్న యువతులు 8.67 లక్షలు
మొత్తం పెళ్లీడు యువకులు 6.50 కోట్లు
మొత్తం పెళ్లీడు యువతులు 2.38 కోట్లు
భారతదేశ పురుష, స్త్రీ నిష్పత్తి 1000:908
సహజ లింగ నిష్పత్తి 1000:954