
ఘోర రోడ్డు ప్రమాదం, 44మంది దుర్మరణం
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సిమ్లా జిల్లా నెర్వా సమీపంలోని ఓ ప్రయివేట్ బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 44మంది దుర్మరణం చెందారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 56మంది ప్రయాణికులు ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.