
ఉత్తరకాశీ : ఉత్తరాఖండ్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తర కాశీలో వేగంగా వచ్చిన వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 10 మంది ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment