ముంబై: కల్తీ మద్యం సేవించి ఐదుగురు మృతిచెందగా, మరో నలుగురు వ్యక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ముంబై సమీపంలోని మల్వానీలో బుధవారం అర్ధరాత్రి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మల్వానీలోని రాథోడ్ గ్రామంలో కొందరు వ్యక్తులు కల్తీ మద్యం సేవించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బాధితులను చికిత్స నిమిత్తం మలాద్ లోని సురానా ఆస్పత్రికి, కందివాలిలోని శతాబ్ది ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించారు.