
సివిల్స్ టాపర్‌కు 52 శాతం మార్కులే
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఈ ఏడాది తొలి స్థానం దక్కించుకున్న టీనా డాబీకి వచ్చిన మార్కులు 52.49 శాతమే. మార్కుల వివరాల్ని ఆదివారం యూపీఎస్సీ వెల్లడించింది. పరీక్షను కఠినతరం చేయడంతో టాప్‌లో నిలిచిన అభ్యర్థుల మార్కులు బాగా తగ్గాయి. డాబీ మొత్తం 2,025(మెయిన్ 1,750, ఇంటర్వ్యూ 275)గాను 1,063 (52.49) మార్కులుసాధించింది. 2వ స్థానంలో నిలిచిన అమిర్ ఉల్ షఫీ ఖాన్ 1,018 (50.27 శాతం) మార్కులు, మూడో ర్యాంకర్ జస్మీత్ సింగ్ సంధు 1,014 (50.07) మార్కులు సాధించారు.
ఈ ఏడాది మొత్తం 1,078 మంది అవసరముండగా, జనరల్‌లో 499, ఓబీసీ 314, ఎస్సీ 176, ఎస్టీ విభాగంలో 89 మంది అభ్యర్థుల పేర్లను యూపీఎస్సీ సిఫార్సు చేసింది. 172 మంది అభ్యర్థులు వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. వెయిటింగ్ జాబితాలో చివరిస్థానంలో ఉన్న శీష్ రామ్‌కు 697(34.41) మార్కులు వచ్చాయి.