కొచ్చి: భారతదేశంలో 60 శాతం మందికి మరుగుదొడ్ల సౌకర్యంలేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ‘ఇది జోక్ కాదు- ప్రపంచ మరుగుదొడ్ల పరిస్థితి’ అనే శీర్షికన వాటర్ ఎయిడ్ అనే సంస్థ అధ్యయన నివేదికను విడుదల చేసింది. సుమారు 77.40 కోట్ల మంది భారతీయుల ఇళ్లల్లో మరుగుదొడ్ల వద్ద క్యూ కడుతున్నారని తెలిపింది. ఈ క్యూను విస్తరిస్తే భూమి, చంద్రమండలానికి మధ్యనున్న దూరంతో సమానమని పేర్కొంది. గురువారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ అధ్యయన వివరాలు తెలిపింది. 1990 నుంచి దేశంలో మరుగుదొడ్ల సౌకర్యం 22.8 శాతం మెరుగైందని, మెరుగుదల కనబర్చిన 8 దక్షిణాసియా దేశాల్లో భారత్ ఏడో స్థానంలో ఉంది. మరుగుదొడ్ల సౌకర్యం మెరుగుపర్చిన దక్షిణాసియా దేశాల్లో నేపాల్ ప్రథమస్థానంలో, ఆ తర్వాత పాకిస్థాన్, భూటాన్ దేశాలు ఉన్నాయని పేర్కొంది. దేశంలో ఆరోగ్యసంక్షోభం నెలకొందని, లక్షా నలభై వేల మంది ఐదేళ్లలోపు చిన్నారులు ప్రతి ఏడాది డయేరియా వ్యాధితో చనిపోతున్నారని తెలిపింది. ఇది 40 శాతం పిల్లల వృద్ధిని నిరోధిస్తోందని, వారి జీవనాన్ని, భవిష్యత్తును దెబ్బతీస్తోందని వెల్లడించింది.
60% జనాభాకు టాయిలెట్ సౌకర్యం లేదు
Published Fri, Nov 20 2015 3:55 AM | Last Updated on Sun, Sep 3 2017 12:43 PM
Advertisement