World toilet
-
వరల్డ్ టాయిలెట్ డే: ఇలాంటి రోజు ఒకటుందా అనుకుంటున్నారా?
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం..వినడానికి వింతగా ఉన్నా ఇలాంటి ఒక రోజు ఉంది. శానిటైజేషన్ ప్రాముఖ్యతపై అవగాహనే దీని ఉద్దేశం.2001 నవంబర్ 19న సింగపూర్‌కు చెందిన జాక్ సిమ్ నేతృత్వంలోని వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ దీన్ని ప్రారంభించింది. తదనంతరం నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డే ప్రకటించారు ఆయన. తరువాత నవంబర్ 19న వరల్డ్ టాయిలెట్ డే జరపాలని అధికారికంగా ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. ఈ మేకు 2013, జూలై 24న యూఎన్ జనరల్ అసెంబ్లీ 67వ సెషన్లో 122 దేశాలు ఈ తీర్మానాన్ని ఆమోదించాయి ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం 2021 థీమ్ “టాయిలెట్లకు విలువ ఇవ్వడం”. ఈ సందర్భంగా ఆసక్తికర వీడియో మీ కోసం.. -
పారిశుధ్య మెరుగుకు కట్టుబడి ఉన్నాం: మోదీ
న్యూఢిల్లీ: దేశంలో పారిశుధ్య వసతులను మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణంలో పాలుపంచుకుంటున్న వారి సేవలను కొనియాడారు. ప్రపంచ టాయిలెట్ డే(నవంబర్ 19) సందర్భంగా ఆదివారం మోదీ ట్వీటర్లో స్పందిస్తూ...‘వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా దేశవ్యాప్తంగా పారిశుధ్య వసతులను మెరుగుపరిచేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటిద్దాం. టాయిలెట్లు నిర్మిస్తున్న వ్యక్తులు, సంస్థలకు అభినందనలు. వారి విలువైన సహకారం స్వచ్ఛ భారత్ మిషన్‌కు తిరుగులేని శక్తినిస్తోంది’ అని పేర్కొన్నారు. -
60% జనాభాకు టాయిలెట్ సౌకర్యం లేదు
కొచ్చి: భారతదేశంలో 60 శాతం మందికి మరుగుదొడ్ల సౌకర్యంలేదని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ‘ఇది జోక్ కాదు- ప్రపంచ మరుగుదొడ్ల పరిస్థితి’ అనే శీర్షికన వాటర్ ఎయిడ్ అనే సంస్థ అధ్యయన నివేదికను విడుదల చేసింది. సుమారు 77.40 కోట్ల మంది భారతీయుల ఇళ్లల్లో మరుగుదొడ్ల వద్ద క్యూ కడుతున్నారని తెలిపింది. ఈ క్యూను విస్తరిస్తే భూమి, చంద్రమండలానికి మధ్యనున్న దూరంతో సమానమని పేర్కొంది. గురువారం ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం సందర్భంగా ఆ సంస్థ అధ్యయన వివరాలు తెలిపింది. 1990 నుంచి దేశంలో మరుగుదొడ్ల సౌకర్యం 22.8 శాతం మెరుగైందని, మెరుగుదల కనబర్చిన 8 దక్షిణాసియా దేశాల్లో భారత్ ఏడో స్థానంలో ఉంది. మరుగుదొడ్ల సౌకర్యం మెరుగుపర్చిన దక్షిణాసియా దేశాల్లో నేపాల్ ప్రథమస్థానంలో, ఆ తర్వాత పాకిస్థాన్, భూటాన్ దేశాలు ఉన్నాయని పేర్కొంది. దేశంలో ఆరోగ్యసంక్షోభం నెలకొందని, లక్షా నలభై వేల మంది ఐదేళ్లలోపు చిన్నారులు ప్రతి ఏడాది డయేరియా వ్యాధితో చనిపోతున్నారని తెలిపింది. ఇది 40 శాతం పిల్లల వృద్ధిని నిరోధిస్తోందని, వారి జీవనాన్ని, భవిష్యత్తును దెబ్బతీస్తోందని వెల్లడించింది.