బంగారం..బంగారం...!
చెన్నై/హైదరాబాద్: బంగారం, బంగారం... బస్టాండులలో, విమానాశ్రయాలలో ఎక్కడ చూసినా బంగారమే. అక్రమంగా తరలిస్తున్న కిలోలకొద్ది బంగారం. కస్టమ్స్ అధికారులు, పోలీసులు ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకుంటూనే ఉన్నారు. అయినా ఈ అక్రమ తరలింపు మాత్రం ఆగడంలేదు.
చెన్నై కోయంబేడు బస్టాండులో ఈ రోజు పోలీసులు ఏకంగా 8 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఈ బంగారానికి సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ తెల్లవారుజామున కస్టమ్స్ అధికారుల దుబాయి నుంచి వస్తున్న ఒక వ్యక్తి నుంచి 640 గ్రాముల బంగారు చైన్లను స్వాధీనం చేసుకున్నారు. షార్జా విమానంలో వచ్చిన కపిల్ రామ్లాల్ అనే ప్రయాణికుడు నుంచి స్వాధీనం చేసుకున్న ఈ బంగారం విలువ 18 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. అయితే ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేయలేదని కస్టమ్స్ అధికారులు తెలిపారు.