koyambedu bus stand
-
‘నేను చాలదా.. ఇంకొకడు కావాల్న’ అంటూ సజీవదహనం
చెన్నె: ముందే వివాహేతర సంబంధం. ఆపై అతడు కాకుండా మరొక వ్యక్తితో సంబంధం కొనసాగించడంపై ఆమె ప్రియుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడి బంధం కొనసాగించకూడదని హెచ్చరించాడు. అయినా ఆమె పట్టించుకోకపోవడంతో అతడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి చివరకు ఆమెను హతమార్చాడు. బస్టాండ్‌లో నిద్రిస్తున్న ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. ఈ దారుణ ఘటన తమిళనాడు చెన్నెలోని కొయంబేడులో చోటుచేసుకుంది. కొయంబేడులో ముత్తు (48), శాంతి (46) ఫుట్‌పాత్ నివాసితులు. వీరిది వివాహేతర సంబంధం. అయితే శాంతి అతడిని కాకుండా వేరే వ్యక్తితో కూడా సంబంధం కొనసాగిస్తోంది. ఇది తెలుసుకున్న ముత్తు ఆమెను వారించాడు. ఆమె వినిపించుకోకపోవడంతో శనివారం తెల్లవారుజామున 1.30 ప్రాంతంలో బస్టాండ్‌లోని ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న శాంతిపై పెట్రోల్ పోసి తగులపెట్టాడు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన స్థానిక వ్యాపారులు, ప్రయాణికులు వెంటనే ఆర్పే ప్రయత్నం చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను ఆస్పత్రికి తరలించగా అప్పటికే శాంతి మృతిచెందింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం కొద్దిసేపటికి ముత్తు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చదవండి: సెల్ఫీ తీసుకుంటూ ఫోన్‌తో నీటిలోకి కొట్టుకుపోయిన బాలుడు చదవండి: డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి -
చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం
సాక్షి, చెన్నై : చెన్నైలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కోయంబేడు ప్రైవేట్ బస్సులు నిలిపే ప్రాంతంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడ ఉన్న బస్సులకు మంటలు అంటుకున్నాయి. బస్సులన్నీ పక్కపక్కనే ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ఇప్పటి వరకు మూడు బస్సులు పూర్తిగా దగ్ధం అయినట్లు తెలుస్తోంది. కాగా సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది వెంటనే ప్రమాద స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయంతో పరుగులు తీశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది. -
బంగారం..బంగారం...!
చెన్నై/హైదరాబాద్: బంగారం, బంగారం... బస్టాండులలో, విమానాశ్రయాలలో ఎక్కడ చూసినా బంగారమే. అక్రమంగా తరలిస్తున్న కిలోలకొద్ది బంగారం. కస్టమ్స్ అధికారులు, పోలీసులు ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకుంటూనే ఉన్నారు. అయినా ఈ అక్రమ తరలింపు మాత్రం ఆగడంలేదు. చెన్నై కోయంబేడు బస్టాండులో ఈ రోజు పోలీసులు ఏకంగా 8 కిలోల బంగారాన్ని పట్టుకున్నారు. ఈ బంగారానికి సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ తెల్లవారుజామున కస్టమ్స్ అధికారుల దుబాయి నుంచి వస్తున్న ఒక వ్యక్తి నుంచి 640 గ్రాముల బంగారు చైన్లను స్వాధీనం చేసుకున్నారు. షార్జా విమానంలో వచ్చిన కపిల్ రామ్‌లాల్ అనే ప్రయాణికుడు నుంచి స్వాధీనం చేసుకున్న ఈ బంగారం విలువ 18 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. అయితే ఆ ప్రయాణికుడిని అరెస్ట్ చేయలేదని కస్టమ్స్ అధికారులు తెలిపారు. Follow @sakshinews