తమిళనాడులో ఘోర రోడ్డుప్రమాదం
తిరుచ్చి : తమిళనాడులో బుధవారం వేకువజామున ఘోరరోడ్డుప్రమాదం సంభవించింది. తిరుచ్చి సమీపంలోని సమయపురం వద్ద ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందగా, మరో 20 మందికి గాయపడ్డారు. ఇందులో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.