సాక్షి,న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నతాధికారులపై మరోసారి చిర్రుబుర్రులాడారు. ఢిల్లీలో 90 శాతం ఐఏఎస్ అధికారులు పనిచేయరని, అందుకే అభివృద్ధి సచివాలయం వద్దే నిలిచిపోయిందని అన్నారు.ఢిల్లీ పూర్తిస్థాయి రాష్ర్ట హోదా పొందితే తమ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులందరినీ 24 గంటల్లో క్రమబద్ధీకరిస్తుందని చెప్పారు. విద్యుత్ శాఖలో పెన్షనర్లకు జరిగిన అభినందన సభలో సీఎం మాట్లాడుతూ అభివృద్ధి పనులకు సంబంధించిన ఫైళ్లను ఐఏఎస్ అధికారులు తొక్కిపెడుతున్నారని ఆరోపించారు.
కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గురించి తాను ప్రతిపాదించినప్పుడు అధికారులంతా తనతో విభేదించారని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తే వారు పనిచేయరని తనతో చెప్పారన్నారు. ఇదే సూత్రం ఐఏఎస్ అధికారులకూ వర్తిస్తుందని, వారంతా పనిచేయడం లేదని అందుకే వారి నియామకాలు తాత్కాలిక ప్రాతిపదికనే ఉండాలని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖ మాజీ ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవల పథకానికీ అధికారులు అవరోధాలు కల్పించారని కేజ్రీవాల్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment