కట్టు కథలతో ఈడీ చార్జిషీట్: రాజా
చెన్నై: దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పై మాజీ కేంద్రమంత్రి ఏ రాజా మండిపడ్డారు. కట్టుకథలు అల్లి డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ పై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిందని రాజా ఆరోపించారు.
స్వాన్ టెలికాం ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ షాహీద్ ఉస్మాన్ బల్వాతో స్టాలిన్ సమావేశం కాలేదని చెన్నై విమానాశ్రయంలో మీడియాతో అన్నారు. అసలు బల్వాతో స్టాలిన్ సమావేశం కాలేదని, ఈడీ కట్టు కథలు అల్లి చార్జిషీట్ ను దాఖలు చేసిందన్నారు.
పక్కా ప్లాన్ ప్రకారం ఈడీ వండిన ఓ వంటకం అని వ్యాఖ్యానించారు. రాజకీయంగా స్టాలిన్ పై బురద చల్లడానికే చార్జిషీట్ దాఖలు చేశారని రాజా అన్నారు. స్టాలిన్ పై ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యకు పాల్పడుతోందని ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. బల్వాతో సమావేశమయ్యారని ఇప్పుడు స్టాలిన్ పై చార్జిషీట్ దాఖలు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.