mk.stalin
-
స్టాలిన్‌తో నగ్మా బేటీ
సాక్షి, చెన్నై: డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా భేటీ అయ్యారు. సోమవారం అన్నా అరివాలయంలో అరగంట పాటుగా ఈ భేటీ సాగింది. మహిళా కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా గత కొంత కాలంగా తన దృష్టిని తమిళనాడు మీద పూర్తి స్థాయిలో కేంద్రీకరించి ఉన్నారు. మహిళా కాంగ్రెస్ బలోపేతం లక్ష్యంగా సమావేశాలు, కేడర్‌తో మమేకం అయ్యే విధంగా ముందుకు సాగుతున్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో పర్యటన నిమిత్తం ప్రత్యేక కార్యాచరణతో ఉరకలు తీస్తున్న నగ్మా ఆదివారం దక్షిణ భారత చలన చిత్ర సూపర్‌స్టార్ రజనీ కాంత్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీ రాజకీయంగా చర్చకు తెర లేపిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సోమవారం అన్నా అరివాలయం చేరుకున్న నగ్మా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఆమెకు స్టాలిన్ సాధర స్వాగతం పలికారు. అరగంట పాటుగా తమిళ రాజకీయ పరిస్థితుల గురించి వీరి బేటీ సాగింది. అనంతరం మీడియాతో నగ్మా మాట్లాడుతూ డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న స్టాలిన్‌ను మర్యాద పూర్వకంగా కలిసినట్టు వివరించారు. డీఎంకే, కాంగ్రెస్ కలిసి కట్టుగా ముందుకు సాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. తమిళనాడులో పాలన మరీ దారుణంగా ఉందని ధ్వజమెత్తారు. పదవుల్ని, ప్రభుత్వాన్ని కాపాడుకోవడం మీద చూపుతున్న శ్రద్ధ ప్రజల మీద చూపించడం లేదని మండి పడ్డారు. ప్రభుత్వ ఖజానా దోపిడీ లక్ష్యంగా పాలకుల చర్యలు ఉన్నాయని ఆరోపించారు. ఇందుకు నిదర్శనం ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో ఓటు కోసం నోట్ల కట్టలు తాండవించడమేనని గుర్తు చేశారు. వైఎంసీఏలో వజ్రోత్సవం: జూన్ మూడో తేదీ ప్రజల్లోకి డీఎంకే అధినేత ఎం.కరుణానిధి రానున్నారన్న సమాచారాన్ని ఇప్పటికే ఆ పార్టీ వర్గాలు పేర్కొన్న విషయం తెలిసిందే. ఆయన జన్మదినోత్సవాన్ని రాజకీయ వజ్రోత్సవంగా జరుపుకునేందుకు డీఎంకే వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందుకు వేదికగా చెన్నై వైఎంసీఏ మైదానాన్ని ఎంపిక చేశారు. ఈ విషయంపై స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ వైద్యుల సూచన మేరకు కరుణానిధి ఆ రోజున వేదిక మీదకు వచ్చే విషయాన్ని తర్వాత ప్రకటిస్తామన్నారు. అధినేత కరుణానిధి రాజకీయ వజ్రోత్సవ వేడుకకు జాతీయ స్థాయి, వివిధ రాష్ట్రాల నుంచి రాజకీయ ప్రముఖులు హాజరవుతారన్నారు. వైఎంసీఏ మైదానంలో ఏర్పాట్లకు నిర్ణయించామని తెలిపారు. -
నేడు డీఎంకే ఉన్నతస్థాయి సమావేశం
పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు పిలుపు సాక్షి, చెన్నై: తమిళనాడులో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ప్రతిపక్ష డీఎంకే సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి డీఎంకే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలంతా హాజరు కావాలని పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్ ఆదివారం సూచించారు. అన్నాడీఎంకేలో కొనసాగుతున్న వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని డీఎంకే భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు చెన్నై తేనాంపేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశం ›జరగనుంది. ప్రతిపక్ష నేత స్టాలిన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు అంశాలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. చిన్నమ్మ ‘సామాజిక’ ఉద్యమం! - ప్రచారం కోసం 760 బృందాల ఏర్పాటు చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: పైచేయి సాధించడం కోసం పన్నీర్ సెల్వం, శశికళ వేస్తున్న ఎత్తులతో తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. సోషల్ మీడియాలో ప్రచారంతో ప్రజల మద్దతు కూడగట్టడంలో పన్నీరు సెల్వం కాస్త ముందున్నారు. ఈ విషయంలో వెనకబడ్డామని గుర్తించిన శశికళ వర్గం ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. శశికళ నివాసంలో జరిగిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో దీనిపై చర్చించారు. పార్టీ ఐటీ విభాగం కార్యదర్శి రాజ్ సత్యన్ నాయకత్వంలో ఐదువేల మందితో 760 బృందాలను ఏర్పాటు చేశారు. దీంతో ఆదివారం రాత్రి నుంచి చిన్నమ్మకు మద్దతుగా సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభమైంది. దీంతో పాటు పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార ప్రతినిధులు విస్తృతంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పన్నీరుపై ఎదురు దాడి చేయాలని శశికళ పురమాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తాలూకాలోనూ తమకు మద్దతుగా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు చేయడం, వాల్ పోస్టర్లు, కరపత్రాలతో ప్రచారం హోరెత్తించేందుకు చిన్నమ్మ రంగంలోకి దిగారు. కాగా... తమ వర్గంలోని నాయకులు, కార్యకర్తలెవరూ శశికళను చిన్నమ్మ అని సంబోధించరాదని పన్నీరు వర్గం ఆదేశించింది. -
కట్టు కథలతో ఈడీ చార్జిషీట్: రాజా
చెన్నై: దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) పై మాజీ కేంద్రమంత్రి ఏ రాజా మండిపడ్డారు. కట్టుకథలు అల్లి డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ పై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసిందని రాజా ఆరోపించారు. స్వాన్ టెలికాం ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్ షాహీద్ ఉస్మాన్ బల్వాతో స్టాలిన్ సమావేశం కాలేదని చెన్నై విమానాశ్రయంలో మీడియాతో అన్నారు. అసలు బల్వాతో స్టాలిన్ సమావేశం కాలేదని, ఈడీ కట్టు కథలు అల్లి చార్జిషీట్ ను దాఖలు చేసిందన్నారు. పక్కా ప్లాన్ ప్రకారం ఈడీ వండిన ఓ వంటకం అని వ్యాఖ్యానించారు. రాజకీయంగా స్టాలిన్ పై బురద చల్లడానికే చార్జిషీట్ దాఖలు చేశారని రాజా అన్నారు. స్టాలిన్ పై ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యకు పాల్పడుతోందని ఓ ప్రశ్నకు జవాబిచ్చారు. బల్వాతో సమావేశమయ్యారని ఇప్పుడు స్టాలిన్ పై చార్జిషీట్ దాఖలు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.