న్యూఢిల్లీ: ఆధార్ కార్డును తీసుకున్నవారి సంఖ్య మరి కొన్ని రోజుల్లో 100 కోట్లు దాటబోతోంది. ప్రస్తుతం 99.91 కోట్ల మంది ఆధార్ కార్డు తీసుకున్నారు. సాంకేతిక కారణాల వల్ల ఈ వివరాలు సంబంధిత వెబ్‌సైట్‌లో నమోదు చేయలేదు. సోమవారం దీనిపై టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రకటన చేయబోతున్నారు.