ఆమిర్‌కు పాక్ టికెట్లు బుక్కయ్యాయి!! | aamir khan and family gets tickets to pakistan | Sakshi
Sakshi News home page

ఆమిర్‌కు పాక్ టికెట్లు బుక్కయ్యాయి!!

Published Thu, Nov 26 2015 6:45 PM | Last Updated on Sun, Sep 3 2017 1:04 PM

ఆమిర్‌కు పాక్ టికెట్లు బుక్కయ్యాయి!!

ఆమిర్‌కు పాక్ టికెట్లు బుక్కయ్యాయి!!

అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఆమిర్ కుటుంబం మొత్తం పాకిస్థాన్ వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్కయ్యాయి. ఆమిర్ ఖాన్, ఆయన భార్య, కొడుకు కోసం నవంబర్ 30న పాక్ వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్ అయ్యాయని, వాటిని హిందూసేన బుక్ చేసిందని ఢిల్లీకి చెందిన ఓ పాత్రికేయుడు ట్వీట్ చేశారు. టికెట్ల కాపీలను కూడా ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

అయితే టికెట్లు ఆమిర్ ఖాన్, ఆయన భార్య కిరణ్ రావు ఖాన్, కొడుకు ఆజాద్ రావు ఖాన్ ముగ్గురి పేరు మీద టికెట్లు బుక్ అయినట్లు ఉంది గానీ.. వాటిని ఎవరు బుక్ చేశారనడానికి మాత్రం అందులో ఎలాంటి ఆధారం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement