80 శాతం 'ఆప్' ఆఫీస్ బేరర్లు రాజీనామా..! | AAP’s 80% office-bearers quit from Amritsar zone | Sakshi
Sakshi News home page

80 శాతం 'ఆప్' ఆఫీస్ బేరర్లు రాజీనామా..!

Sep 6 2016 1:47 PM | Updated on Sep 4 2017 12:26 PM

80 శాతం 'ఆప్' ఆఫీస్ బేరర్లు రాజీనామా..!

80 శాతం 'ఆప్' ఆఫీస్ బేరర్లు రాజీనామా..!

మేమంతా సామూహికంగా ఆప్ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం అంటూ పార్టీ అమృత్సర్ జోన్ ఇన్ ఛార్జ్ గురిందర్ సింగ్ బజ్వా తెలిపారు.

అమృత్సర్ః ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ లో తంటాలు మొదలయ్యాయి. అమృత్సర్ మండలంనుంచి 86 మంది ఆఫీస్ బేరర్లు పార్టీ ప్రధాన సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీ నిరంకుశ  ప్రవర్తనే వారి రాజీనామాకు కారణమని పరిశీలకులు  పేర్కొన్నారు. అయితే ఆప్ నుంచి రాజీనామా చేసిన సభ్యులంతా రాజకీయవేత్తగా మారిన మాజీ క్రికెటర్.. నవజ్యోత్ సింగ్ సిద్ధూ నేతృత్వంలో వెలువడుతున్నఫోర్త్ ఫ్రంట్ ఆవాజ్-ఇ-పంజాబ్ లో చేరనున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.

ఇది చాలా కష్టమైన నిర్ణయమే అయినప్పటికీ మేమంతా సామూహికంగా ఆప్ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాం అంటూ పార్టీ అమృత్సర్ జోన్ ఇన్ ఛార్జ్ గురిందర్ సింగ్ బజ్వా తెలిపారు. దీంతో ఆప్ అమృత్సర్ జోన్ లోని 80 శాతంమంది సభ్యులు రాజీనామా చేసినట్లు ఆయన పేర్కొన్నారు. పంజాబ్ లోని మరో ఏడు మండలాల్లోని సభ్యులు కూడా తమను అనుసరించే అవకాశం ఉన్నట్లు తెలిపారు.

మొత్తం 36 సర్కిల్స్, 34 సెక్టర్లు, 11 మండలాలకు చెందిన ఇన్ ఛార్జిలతో సహా పార్టీలో ఐదుగురు ఇతర ఆఫీస్ బేరర్లు కూడా ఉన్నట్లు తెలిపారు. మంగళవారం ఆప్ మాజీ కన్వీనర్ సుచా సింగ్ ఛొతేపూర్ ఆధ్వర్యంలో గురుదాస్ పూర్ నుంచి ప్రారంభమయ్యే పంజాబ్ పరివర్తన్ యాత్రలో పాల్గొని, స్వచ్ఛందంగా వారి సలహాలను తీసుకొన్న అనంతరం తదుపరి చర్యలపై తుది నిర్ణయం తీసుకుంటామని బజ్వా అన్నారు.

Advertisement
Advertisement