
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభణ లాంటి సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడు భారత్‌లోని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కమిటీలను ఏర్పాటు చేయడం పరిపాటి. అయితే కొన్ని రాష్ట్రాలు వీటిని కమిటీలని కాకుండా టాస్క్‌ఫోర్స్‌లని, ఎంపవర్డ్ గ్రూప్స్ అని, కోఆర్డినేషన్ టీమ్‌లని, వార్ రూమ్స్ అని పిలుస్తున్నాయి. ఎలా పిలిచినా అందరి ఉద్దేశం కమిటీలే. ఈ కమిటీల పద్ధతి మనకు బ్రిటీష్ పాలకుల నుంచి వచ్చిన సంప్రదాయం.
అందుకనే మన కమిటీల్లో నిపుణులకు బదులుగా అధికారులు లేదా రాజకీయ విధేయులు ఎక్కువగా ఉంటారు. మధ్యకాలం నాటి ఇంగ్లీషు భాష ప్రకారం ‘క్రైసిస్ (సీఆర్‌ఐఎస్‌ఐఎస్)’ మలుపు అని అర్థం. ఇప్పుడదికాస్త సంక్షోభంగా మారింది. అదే లాటిన్ పదం ‘క్రైసిస్ (కేఆర్‌ఐఎస్‌ఐఎస్)’ ప్రకారం డౌట్ (సందేహం) అని అర్థం. కనుక మన రాజకీయ నాయకులు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనప్పుడు, లేదా ఏ నిర్ణయం తీసుకుంటే ఏ కొంప మునుగుతుందో తెలియక సందేహంలో పడినప్పుడే కమిటీలు వేస్తుంటారు. చదవండి: అలర్ట్: ఆ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
Comments
Please login to add a commentAdd a comment