న్యూఢిల్లీ : సరిహద్దులో శత్రువు ఏ ప్రదేశంలో నక్కి ఉన్నా పట్టుకుని బయటకు తేగల సత్తా భారతీయ వాయుసేనకు ఉందని వాయుదళాధిపతి బీఎస్ ధనోవా గురువారం పేర్కొన్నారు. సర్జికల్స్ స్ట్రైక్స్ కేవలం ప్రభుత్వ నిర్ణయం మేరకే జరిగినట్లు వెల్లడించారు. చైనా నుంచి వచ్చే ఎలాంటి ఉపద్రవాన్నైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
వాయుసేన వద్ద పూర్తి బలం(42 స్వ్కాడ్రన్లు) లేకపోయినా 'ప్లాన్ బీ'తో పోరాడగలమని రానున్న ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. 2032కల్లా భారతీయ వాయుదళం పూర్తి బలాన్ని చేకూర్చుకుంటుందని చెప్పారు. డొక్లామ్ లో ఉద్రిక్తత గురించి మాట్లాడుతూ.. చైనా దళాలు టిబెట్ లోని చుంబీ వ్యాలీలో ఉన్నాయని తెలిపారు. ఆ ప్రాంతం నుంచి కూడా దళాలను చైనా ఉపసంహరించుకుంటుంని భావిస్తున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment