ఐదుగురికి యావజ్జీవం | All 5 convicts get life in jail for Dhaula Kuan gangrape | Sakshi
Sakshi News home page

ఐదుగురికి యావజ్జీవం

Published Tue, Oct 21 2014 3:48 AM | Last Updated on Sat, Sep 2 2017 3:10 PM

ఐదుగురికి యావజ్జీవం

ఐదుగురికి యావజ్జీవం

న్యూఢిల్లీ: ఢిల్లీలో సంచలనం సృష్టించిన దౌలాకాన్ గ్యాంగ్‌రేప్ కేసులో స్థానిక కోర్టు సోమవారం ఐదుగురు దోషులకు యూవజ్జీవ కారాగార శిక్ష విధించింది. మిజోరంకు చెందిన ఓ బీపీఓ ఉద్యోగిపై 2010లో జరిగిన సామూహిక అత్యాచారం కేసు విచారణ సందర్భంగా స్థానిక అదనపుసెషన్స్ జడ్జి వీరేందర్ భట్ వీరికి యావజ్జీవ శిక్షతోపాటు ఒక్కొక్కరికీ రూ.50వేల చొప్పున జరిమానా విధించారు. ఈ మెుత్తాన్ని బాధితురాలికి నష్టపరిహారం కింద చెల్లించాలని ఆదేశించారు. అపహరణ, కుట్ర తదితర నేరాల కింద ఏడేళ్లు, ఐదేళ్ల చొప్పున కూడా వీరికి శిక్షలు విధించారు.
 
 దోషులుగా నిరూపితమైన ఉస్మాన్, శంషాద్, షాహిద్, ఇక్బాల్ల్, కవ్రుుద్దీన్‌లు హర్యానాలోని మేవాట్ ప్రాంతానికి చెందినవారు. వీరు పేద కుటుంబాలకు చెందిన వారని, ఈ దృష్ట్యా శిక్ష తగ్గించాలని వారి తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దోషులు ఉన్మాదులని, వారిని సమాజానికి దూరంగా ఉంచాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 2010 నవంబర్ 23 అర్ధరాత్రి బాధితురాలు ఆఫీసు నుంచి వస్తుండగా దోషులు ఆమెను అపహరించి అత్యాచారానికి పాల్పడి ఓ నిర్జన ప్రాంతంలో వదిలేశారు. ఈ కేసులో 2010 డిసెంబర్ 2న ఇద్దరు  6న మిగతావారిని పోలీసులు అరెస్టు చేశారు. 2011 ఫిబ్రవరి 2న పోలీసులు చార్జిషీటు దాఖలు చేశారు. 2014 జూన్ 2న తుది వాదనలు జరిగారుు. అక్టోబర్ 14న కోర్టు నిందితులను దోషులుగా నిర్ధారించింది.

Advertisement
Advertisement