ప్రధాని మోదీ తరువాత బిగ్‌బీనే | Amitabh Bachchan Becomes Second Most Followed Indian Celeb On Twitter After Narendra Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీ తరువాత బిగ్‌బీనే

Published Fri, Feb 7 2020 8:32 AM | Last Updated on Fri, Feb 7 2020 9:13 AM

Amitabh Bachchan Becomes Second Most Followed Indian Celeb On Twitter After Narendra Modi - Sakshi

ప్రధాని మోదీ, అమితాబ్‌ బచ్చన్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ: ట్విటర్‌లో అత్యంత చురుకైన బాలీవుడ్ సెలబ్రిటీలలో ఒకరైన అమితాబ్ బచ్చన్  (77) మరో మైలురాయిని అధిగమించారు. గురువారం నాటికి ట్విటర్లో  ఈ బాలీవుడ్‌ మెగాస్టార్‌  ట్విటర్‌  ఫాలోవర్ల సంఖ్య 40 మిలియన్లను దాటేసింది. అంతేకాదు ఎక్కువ మంది  ఫాలోవర్లు  ఉన్న భారతీయ ప్రముఖుల్లో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (50 మిలియన్ల) తరువాత రెండవ వ్యక్తిగా ఆయన నిలిచారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాంలలో కూడా చురుగ్గా వుండే దాదాసాహెబ్ ఫాల్కే  అవార్డు గ్రహీత, బిగ్‌బీ  పై అభినందనల వెల్లువ కురుస్తోంది. బిగ్‌బీకి ఫేస్‌బుక్‌లో 27.9 మిలియన్లు, ఇన్‌స్టాగ్రామ్‌లో 14.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు  ఉండటం విశేషం.

కాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో షారూఖ్ 39.4 మిలియన్ల మంది ఫాలోవర్లతో మూడవ స్థానంలో ఉన్నారు. బి-టౌన్‌లో వాణిజ్యపరంగా విజయవంతమైన నటులలో ఒకరైన అక్షయ్ కుమార్ 33.7 మిలియన్ల ఫాలోవర్లను తన ఖాతాలో జోడించుకున్నారు. మరోవైపు  సల్మాన్ ఖాన్‌ కూడా త్వరలో 40 మిలియన్ల బెంచ్ మార్కును చేరుకోనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement