
ముంబై: బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీకి కరెంటు బిల్లు షాకిచ్చింది. అదానీ ఎలక్ట్రిసిటీ 1,03,564 రూపాయలు బిల్లుగా పంపడంతో ఆయన బిత్తరపోయారు. ఈ మేరకు ఆదివారం వరుస ట్వీట్లు చేశారు. అదానీ ఆయనకు లక్ష రూపాయలు బిల్లు వేసిందని, ఎవరైనా తన పెయింటింగ్స్ కొని డబ్బిస్తే ఆ బిల్లు కడతానన్నారు. తన పెయింటింగ్స్‌పై వచ్చిన న్యూస్ ఆర్టికల్‌ను ఆ ట్వీట్‌కు జోడించారు. (కరోనాతో హాలీవుడ్ నటుడు మృతి)
వచ్చే నెలలో కూడా ఇలానే బిల్లు వస్తే ఇక కిడ్నీలు అమ్ముకోవాల్సిందేనంటూ జోక్ చేశారు. కొద్దిసేపటికి అదానీ తన బిల్లును సరి చేసిందంటూ మరో ట్వీట్ చేశారు. జూన్ నెలలో చాలా సినీ తారలకు, సామాన్యులకు కరెంటు బిల్లులు అధికంగా వచ్చాయి. వీరిలో తాప్సీ పన్ను, రేణుకా షాహానే, హుమా ఖురేషి, నిమ్రత్ కౌర్, సోహా అలీ ఖాన్, అమైరా దస్తూర్, డినో మోరియా, కామ్యా తదితరులున్నారు. (పబ్‌జీ ఉచ్చు: తాతా ఖాతాకు చిల్లు)
Comments
Please login to add a commentAdd a comment