న్యూఢిల్లీ: భూకంపాల సమాచారం పొందేందుకు డిసెంబర్‌కల్లా దేశంలో 31 భూ పరిశీలన కేంద్రాలను భూ విజ్ఞాన శాఖ ఏర్పాటు చేయనుంది. ఉత్తరప్రదేశ్‌లో ఐదు, హర్యానా, బిహార్‌ల్లో నాలుగేసి, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీలో మూడేసి, జమ్మూకశ్మీర్, రాజస్తాన్, మధ్యప్రదేశ్‌ల్లో రెండేసి, ఉత్తరాఖండ్, జార్ఖండ్, పంజాబ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, లక్షద్వీప్‌ల్లో ఒక్కో కేంద్రం చొప్పున ఇవి ఏర్పాటు కానున్నాయి.
ఇవి భూ అంతర్భాగ కదలికలను డిజిటల్ సిస్మోగ్రఫీ ద్వారా రికార్డు చేస్తాయి. జాతీయ సిస్మోగ్రాఫికల్ కేంద్రం మొత్తం 84 సిస్మోలాజికల్ పరిశోధనా కేంద్రాల ద్వారా దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన సమాచారాన్ని భద్రపరుస్తోంది. ఒకవేళ భూకంపం సంభవిస్తే ఈ అబ్జర్వేటరీలు అందుకు సంబంధించిన సమాచారాన్ని ఈ కేంద్రానికి పంపిస్తాయి. అక్కడ నుంచి ఈ సమాచారం ప్రధానమంత్రి కార్యాలయానికి, సెక్రటేరియట్‌కు, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్లకు చేరుతుంది.