'సజావుగా సాగనిస్తామన్నారు' | beginning of an all-party meeting | Sakshi
Sakshi News home page

'సజావుగా సాగనిస్తామన్నారు'

Published Sun, Jul 17 2016 2:00 PM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

beginning of an all-party meeting

న్యూఢిల్లీ: కేంద్ర అఖిలపక్ష భేటీ సజావుగా జరిగిందని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ అన్నారు. అన్ని పార్టీల నేతలు సమావేశాలకు సహకరిస్తామని చెప్పారని తెలిపారు. ఆదివారం మంత్రి అనంత్ కుమార్ నేతృత్వంలో ఆదివారం అఖిలపక్ష భేటీ జరిగింది. ఇందులో రేపటి నుంచి జరగబోయే పార్లమెంటు సమావేశాలపై ఈ భేటీలో చర్చించారు.

ముఖ్యంగా సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలకు  ఎన్డీఏ విజ్ఞప్తి చేసింది. జీఎస్టీ బిల్లుపై ప్రధానంగా చర్చించారు. ఈ సమావేశానికి  వైఎస్ఆర్ సీపీ ఎంపీలు మేకపాటి, విజయసాయిరెడ్డి హాజరయ్యారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్ట సవరణ, విభజన హామీలపై వీరు ప్రస్తావించారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement