న్యూఢిల్లీ: కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌కు భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడిని ప్రకటించింది. లోక్‌సభ ఎంపీ జమయంగ్ నంగ్యాల్ షెరింగ్ లద్దాఖ్ బీజేపీ ప్రెసిండెంట్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. 35 ఏళ్ల నంగ్యాల్ లద్దాఖ్ నుంచి తొలిసారిగా ఎంపీగా గెలిచారు. పార్లమెంట్‌లో పై ప్రభావవంతంగా ప్రసంగించి హైలైట్ అయ్యారు. దీంతోపాటు గుజరాత్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సీఆర్ పాటిల్‌ను నియమిస్తున్నట్టు పార్టీ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. 65 ఏళ్ల సీఆర్ పాటిల్ గుజరాత్‌లోని నవ్‌సారి ఉంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. టెక్నాలజీని వాడుకుని తన నియోజవర్గాన్ని అభివృద్ధి పరుగులు పెట్టించిన పాటిల్‌కు మంచి గుర్తింపు లభించింది. ఆయన పనితనం చూసి ఏకంగా ప్రధాని మోదీయే తన నియోజకవర్గం వారణాసిలో అభివృద్ధి కార్యకలాపాలను పర్యవేక్షించాలని కోరారు. వరుసగా మూడోసారి పాటిల్ నవ్‌సరి నుంచి ఎంపీగా ఐదు లక్షలకు పైగా మెజారిటీతో గెలవడం విశేషం.
(క్షణాల్లో 31.50 లక్షలు మాయం)
లద్దాఖ్, గుజరాత్‌కు బీజేపీ నూతన అధ్యక్షులు
Published Mon, Jul 20 2020 7:38 PM | Last Updated on Mon, Jul 20 2020 9:21 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment