మోదీ ర్యాలీకి రైలు బుక్ చేసినందుకు.. | BJP leader who booked train for Modi in 2014 in fare mess | Sakshi
Sakshi News home page

మోదీ ర్యాలీకి రైలు బుక్ చేసినందుకు..

Published Wed, Mar 16 2016 8:52 AM | Last Updated on Wed, Aug 15 2018 2:12 PM

BJP leader who booked train for Modi in 2014 in fare mess

లక్నో: ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ సిక్రీ యూనిట్ బీజేపీ చీఫ్ వినోద్ సమారియాకు ఓ సమస్య వచ్చిపడింది. 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ పాల్గొన్న లక్నో ర్యాలీకి ఆగ్రా నుంచి కార్యకర్తలను తీసుకెళ్లేందుకు ఆ పార్టీ ఓ రైలును బుక్ చేసింది. బీజేపీ నాయకుడు వినోద్ సమారియా పేరు మీద ఈ రైలును బుక్ చేశారు.

ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించడం, మోదీ ప్రధాని అయిన సంగతి తెలిసిందే. ఇంతవరకు బాగానే ఉన్నా రెండేళ్ల క్రితం బుక్ చేసుకున్న రైలుకు బీజేపీ నాయకులు ఇంకా అద్దె చెల్లించలేదు. దీంతో రైలు అద్దె 12.3 లక్షల రూపాయలు చెల్లించాల్సిందిగా రైల్వే శాఖ వినోద్కు తాఖీదులు పంపింది. వినోద్ పేరు మీద రిజర్వేషన్ చేసుకున్నందుకు ఆయనకు చిక్కులు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని పార్టీ నాయకులకు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన వినోద్.. బీజేపీ రైలు అద్దె చెల్లించకుంటే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement