‘మా శవాల మీదనుంచి నీ కారు పోనియ్‌’ | BJP Leaders, Lying On Road, Ask Why They're Left Out | Sakshi
Sakshi News home page

‘మా శవాల మీదనుంచి నీ కారు పోనియ్‌’

Published Thu, Jan 26 2017 7:04 PM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM

‘మా శవాల మీదనుంచి నీ కారు పోనియ్‌’

‘మా శవాల మీదనుంచి నీ కారు పోనియ్‌’

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో బీజేపీకి సొంతగూటి నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సీట్ల కేటాయింపు విషయంలో తారతమ్యాలు ఏర్పడి అసంతృప్తులు రోడ్లెక్కుతున్నాయి. తమకు సీట్లు కేటాయించలేదని ఇద్దరు బీజేపీ నేతలు రోడ్డుకు అడ్డంగా పడుకున్నారు. బీజీపీ రాష్ట్ర చీఫ్‌ కేపీ మౌర్యా కారుకు అడ్డంగా పడుకొని తమ మద్దతుదారుల సహాయంతో రోడ్డు దిగ్భందించారు. మా శవాల మీద నుంచి మీ కారును పోనివ్వండి అంటూ నినాదాలు చేశారు. దాదాపు గంటపాటు వారు నిరసన ఆందోళనకు దిగారు.

ఉత్తరప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ స్థానాల్లో ఇప్పటి వరకు 370మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. అయితే, అందులో తమకు సీటు దక్కలేదని సుందర్‌ లాల్‌ దీక్షిత్‌, రాంబాబు ద్వివేది అనే పార్టీకి చెందిన వ్యక్తులు తీవ్ర అసంతృప్తి చెందారు. ఇక తమకు సీటు దక్కదని భావించి పార్టీ కార్యాలయం దగ్గర్లోనే రోడ్డుపై బీజేపీ రాష్ట్ర చీఫ్‌ కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య వెళుతుండగా ఆయన కారుకు అడ్డంగా పడుకున్నారు. ‘మా శవాల మీదనుంచి మీరు కానిపోనివ్వండి అంటూ గట్టిగా అరిచారు. దీంతో మీడియా కెమెరాలన్నీ కూడా వారివైపే తిరిగాయి.

Advertisement

పోల్

Advertisement