
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ శనివారం ప్రకటించే అవకాశం ఉంది. అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ నేడు సమావేశం కానుంది. ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా పార్టీ అగ్రనాయకులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. మొదటిదశ పోలింగ్ జరిగే స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లను ఈ జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. పలువురు సిట్టింగ్ ఎంపీలకు టికెట్లు నిరాకరించే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక కోసం ప్రజల అభిప్రాయాన్ని సేకరించడంతో పాటు ఎంపీలు తమ పదవీకాలంలో చేపట్టిన పనుల వివరాలు అందించాలని పార్టీ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment